బాలీవుడ్‌ హాట్ కపుల్స్‌.. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండలంలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు.

అయోధ్యలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. సరయూ నది భక్త జన సందోహంగా మారింది. తెల్లవారు జామునే సరయూ నది ఒడ్డుకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అటు వారణాసిలోనూ కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. గంగా నదిలో ఉదయాన్నే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శివనామస్మరణతో గంగా తీరం మారు మోగింది. వారణాసిలో ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి జరిగే మూలవిరాట్‌ అభిషేకాలు, మండప అభిషేకాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. త్రికోటేశ్వరస్వామిని దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు, అన్నదానం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా సుమారు 30 వేల మంది భక్తులు […]

శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణలతో మారుమోగుతోంది. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. తెల్లవారు జామున పాతాళ గంగలో స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రుద్రహోమం, చండీ హోమాలను రెండు విడతలుగా చేస్తున్నారు. తెల్లవారు జామున గం.లకు 2.30 మంగళ వాయిద్యాలు, గం.లకు 2.30 సుప్రభాత సేవ, మహా మంగళ హారతి పూర్తి చేశారు. తర్వాత భక్తులకు […]

తిరుమల క్షేత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆలయ ప్రాంగణాన్ని పూలతో ఆలంకరించారు. ఏటా కార్తీకమాసంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్పయాగం కోసం.. టీటీడీ ఉద్యానవన విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలు సేకరిస్తుంది. తిరుమల వేంకటేశ్వరుడు అలంకారప్రియుడు. నిత్యం శ్రీవారిని రకరకాల పూలతో అలంకరిస్తారు. మేలుకొలుపు నుంచి పవళింపు సేవ వరకు స్వామివారిని పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేస్తారు. సర్వాలంకారభూషితుడైన దేవదేవున్ని […]

UPDATE : ఈ కింది వార్తకు సంబంధించి ఇచ్చిన సమాచారంలో కొన్ని తప్పులు దొర్లాయి.. ఉత్తరప్రదేశ్‌లో దీపావళి వేడుకల సందర్బంగా అయోధ్యలో 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించారని.. ఈ వేడుకలకు యోగి ఆదిత్యనాధ్ సర్కార్ రూ. 133 కోట్లు ఖర్చు చేసినట్టు వార్త రాశాము.. ఇది తప్పు వార్త అని తేలింది. ఈ వార్త రాసినందుకు చింతిస్తున్నాము.. దయచేసి గమనించగలరు.   ఉత్తరప్రదేశ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా […]

నాన్నా.. నాకు క్రాకర్స్ కొనిస్తానని పోయిన వారం చెప్పావు.. ఇప్పటి వరకు కొనలేదు.. రేపే దీపావళి.. ఇంకెప్పుడు కొంటావు.. ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా రాకపోతే.. క్రాకర్స్ కొనకపోతే.. నేను అన్నం తినను.. పదేళ్ల బుజ్జిగాడు నాన్న మీద అలిగాడు.. ఇంట్లో ఉన్న అమ్మను సతాయిస్తున్నాడు.. చేతికి అందినవి విసిరేస్తున్నాడు. ఇల్లంతా గందరగోళం చేస్తున్న బుజ్జిగాడిని బామ్మ, తాత దగ్గరకు తీసుకుని నాలుగు మంచి మాటలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. […]

పవిత్రమైన కార్తీక మాసంతో అయ్యప్ప భక్తుల హడావిడి మొదలవుతుంది. 41 రోజుల దీక్షను చేపట్టి నియమ నిష్టలతో భగవంతున్ని ఆరాధిస్తుంటారు. స్వాములు పొద్దున్నే చేసే చన్నీళ్ల స్నానం.. ఒక్కపూటే భోజనం.. చెప్పుల్లేకుండా నడవడం.. రెండు పూట్లా భక్తితో అయ్యప్ప ఆరాధన.. ప్రతి రోజూ భజనలు.. దురలవాట్లకు దూరంగా.. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ 41 రోజులు మండల దీక్షను చేసే అయ్యప్ప మాలధారులను కనిపించే దైవంగా చూస్తారు భక్తులు, బంధుమిత్రులు. అయ్యప్ప […]

పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరగనుంది.. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రెండో సమావేశం ఇది. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు ఉద్యోగులను పే స్కేల్‌ విధానంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా విధుల్లోకి తీసుకునే అంశంపై పాలక మండలి చర్చించనుంది.. ఇందులో స్థానికులకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉండే […]

శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఓ వైపు నిధులు సమకూర్చుకుంటూనే… మరోవైపు దళారి వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు.. శ్రీవాణి పథకంతో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకానికి… పదివేలు విరాళం ఇస్తే.. వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్ట్‌ అందించనుంది టీటీడీ. ఇందుకోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. నవంబర్‌ తొలివారంలో శ్రీవాణి ట్రస్ట్‌ పథకానికి […]