Samarasimha Reddy : 23 ఏళ్ల సమరసింహారెడ్డి.. ఆ ఒక్క సీన్ నచ్చలేదని సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్..!

Samarasimha Reddy : 23 ఏళ్ల సమరసింహారెడ్డి.. ఆ ఒక్క సీన్ నచ్చలేదని సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్..!
X
Samarasimha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే అంచనాలు మాములుగా ఉండవు.

Samarasimha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే అంచనాలు మాములుగా ఉండవు.. అప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఈ సారి చేయబోయే సినిమా హ్యాట్రిక్ అవుతుంది. అంచనాలు కూడా స్థాయిని మించిపోతాయి.

అందుకే కథ విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదు దర్శకుడు గోపాల్.. కథారచయిత విజయేంద్రప్రసాద్ చెప్పిన 30 కథలు విని ఫైనల్‌‌గా సమరసింహారెడ్డి కథని ఫైనల్ చేశారు. అప్పటివరకు ఇండస్ట్రీని ఫ్యామిలీ మూవీస్ రాజ్యమేలుతున్న టైం అది.. ఆలాంటి టైంలో వచ్చిన ఫ్యాక్షన్ మూవీ ఇది.. సంక్రాంతి హీరోగా బాలయ్యకి ఎలాగు మంచి పేరుంది. అందుకే ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించారు.

ఆ టైంలోనే అంటే 1999 జనవరి 13 న ఈ సినిమా రిలీజై చరిత్ర సృష్టించింది. దిమ్మతిరిగే కలెక్షన్లు రాబట్టింది. అలాంటి సమరసింహారెడ్డికి నేటితో 23ఏళ్ళు పూర్తి అయ్యాయి. సిందూరపువ్వు అనే తమిళ సినిమా నుంచి మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి సమరసింహారెడ్డి సినిమా కథని రాసుకున్నారు విజయేంద్రప్రసాద్. అప్పటికి విజయేంద్రప్రసాద్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు సినిమా కథకి రాయలసీమ ఫాక్షన్ ని జత చేశారు.

అప్పట్లో లవ్ ట్రాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన మొదటి సినిమా ఇదే. అలాగే ఫ్యాక్షన్ బేస్డ్ కథాంశంతో ఇండస్ట్రీ హిట్ అయిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తర్వాత చాలా ఫ్యాక్షన్ మూవీస్ వచ్చాయి. ముందుగా ఈ సినిమాకి సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారు .. కానీ పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు సమరసింహారెడ్డిగా మార్చారు. బాలయ్య, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే.

ముందుగా రాశి, సంఘవి, అంజలా జవేరిలని హీరోయిన్లుగా అనుకున్నారు. కానీ రాశి.. సినిమాలోని సీతాకోకచిలుక సన్నివేశానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ ని తీసుకున్నారు. ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 16 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం మూడు థియేటర్లలో 227 రోజులు, 29 కేంద్రాలలో 175 రోజులు, 122 కేంద్రాలలో 50 రోజులు, 73 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఈ సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా బి గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు.

Tags

Next Story