NBK 109 : బాలయ్య కొత్త మూవీకి పవర్ ఫుల్ టైటిల్?

NBK 109 : బాలయ్య కొత్త మూవీకి పవర్ ఫుల్ టైటిల్?

సీనియర్ హీరో అయినా.. నేటితరంతో జై కొట్టించుకుంటున్న ఘనత బాలయ్యకే (Balayya) దక్కుతుంది. మాస్ ప్రేక్షకులు అందరూ కూడా బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతుంటారు. వరుస సూపర్ హిట్ లు కొడుతూ 60 ఏళ్ల వయసులోనూ దుమ్ము లేపుతున్నారు బాలయ్య.

బాలయ్య తన కొత్త మూవీ రిలీజ్ తో మిగతా సినిమాలకు దడ పుట్టిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏకంగా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో దూకుడు మీద ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బాబితో ఒక మూవీ చేస్తున్నాడు. ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి శివరాత్రి సందర్భంగా విడుదలైన గ్లింప్స్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టారంటూ టాక్ నడుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వీరమాస్ అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసిందట. అయితే ఈ టైటిల్ బాలకృష్ణసినిమా కోసమే అని కొంతమంది అనుకుంటూ ఉంటే.. కాదు మరో సినిమా కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేశారు అంటూ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తేగానీ దీనిపై క్లారిటీ వచ్చే చాన్సు లేదు.

Tags

Read MoreRead Less
Next Story