Car Trouble : రోడ్డు మీద కారు ట్రబుల్.. తోసిన హరీష్ శంకర్

Car Trouble : రోడ్డు మీద కారు ట్రబుల్.. తోసిన హరీష్ శంకర్

రోడ్డు మీద ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిన ఓ కారు కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ వెనుకే మరో కారులో దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar), ‘మైత్రీ’ నిర్మాత రవి శంకర్ (Ravi Shankar), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) సనా ఉన్నారు. ఆ ట్రాఫిక్‌లో వారూ చిక్కుకున్నారు. దీంతో కారు దిగిన ఆ ఇద్దరు, మరి కొంతమందిని కలుపుకొని కారును ముందుకు నెట్టారు. ఆ కార్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ హరీష్ శంకర్, రవి శంకర్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ స్థాయి మరచి మరొకరికి ఇలా సహాయం చేయడం గొప్ప విషయం అంటున్నారు.

హరీశ్-మైత్రీ కాంబినేషన్‌లో రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేసి మూడేళ్ళ నుంచి ఎదురుచూస్తున్నా పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాని చేస్తున్నారు హరీష్ శంకర్. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story