Pushpa 2 : పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇదిగో..!

Pushpa 2 : పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇదిగో..!

ఆలిండియా హీరో అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి మరో అప్ డేట్ వచ్చింది. టాలీవుడ్ కు ఐకాన్ గా మారిపోయిన అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన ఈ అప్ డేట్ అభిమానులను వెర్రెత్తిస్తోంది. సుకుమార్ తర్కెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండగా రష్మిక మందన నాయకిగా నటిస్తోంది.

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్ ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 నుండి పుష్ప పుష్ప అనే సాంగ్ ప్రోమోని బుధవారం సాయంత్రం 4 గం.5 ని లకు రిలీజ్ చేయనున్నారు. నిర్మాతలు దీనిపై రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న పుష్ప 2 పాటల కోసం యావద్దేశం ఎదురుచూస్తోంది. ఈ మూవీ ఆగస్టు15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

Tags

Read MoreRead Less
Next Story