Himaja: బుల్లితెర నటి విడాకులపై రూమర్స్.. సోషల్ మీడియాలో..

Himaja (tv5news.in)

Himaja (tv5news.in)

Himaja: రాజేష్ ఆనంద్ తర్వాత చల్లా విజయ్‌ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడింది హిమజ.

Himaja: సినీ పరిశ్రమలో.. ముఖ్యంగా టాలీవుడ్‌లో విడాకులు అనేవి చాలా కామన్‌గా మారిపోయాయి. విడాకులు అనేవి పర్సనల్ విషయమే అయినా.. సెలబ్రిటీలు చాలామంది ఈ నిర్ణయం తీసుకోవడంతో వాటిపై చాలా ఫోకస్ ఏర్పడుతోంది. తాజాగా మరో బుల్లితెర నటి కూడా విడాకులు తీసుకోనుందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఏ సెలబ్రిటీ గురించైనా.. ఏ విషయమైనా తెలుసుకోవాలంటే వారి సోషల్ మీడియా చూస్తే చాలు.. పైగా విడాకుల విషయాన్ని కూడా ఈ మధ్య సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారానే ప్రకటిస్తున్నారు. అందుకే అందరికంటే ముందుగా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు వారిని ఫాలో అయ్యే అభిమానులకే తెలుస్తోంది.

హిమజ.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లాగా చేసి బిగ్ బాస్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే రాజేష్‌ ఆనంద్‌ అనే వ్యాపారవేత్తతో తనకు పెళ్లయిపోయింది. ఈ విషయం చాలామందికి తెలియకపోయినా.. గూగుల్ మాత్రం హిమజ మొదటి భర్త రాజేష్ ఆనంద్ అనే చెప్తుంది. అయితే తనతో పలు కారణాల వల్ల విడిపోయిందట హిమజ.

రాజేష్ ఆనంద్ తర్వాత చల్లా విజయ్‌ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడింది హిమజ. అయితే గత కొన్నాళ్లుగా వీరి మధ్య విభేదాలు వస్తున్నాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో హిమజ.. తన భర్తను అన్‌ఫాలో చేయడంతో ఈ రూమర్స్ నిజమేనేమో అని భావిస్తున్నారు నెటిజన్లు. ఇది నిజమో కాదో హిమజనే క్లారిటీ ఇవ్వాలి..

Tags

Read MoreRead Less
Next Story