NTR Fav Movie : తారక్‌కు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..

NTR Fav Movie : తారక్‌కు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..

టాలీవుడ్ లో ఎవరు ఔనన్నా.. కాదన్నా.. కొణిదెల, నందమూరి కుటుంబాల డామినేషన్ ఉంటుంది అనేది నిర్వివాదాంశం. మెగా, నందమూరి ఫ్యామిలీలకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది.

ఈ రెండు కుటుంబాల నుంచి స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా.. కుర్ర హీరోలు కూడా సత్తా చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ మాస్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఆరాధ్య భావమే ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడల్లా తారక్ కూడా చిరంజీవి గురించి మాట్లాడుతుంటారు. ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో నా ఫేవరెట్ రుద్రవీణ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.

రుద్రవీణ సినిమా ఫ్లాపయింది. కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఐతే.. ఇప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. కొన్ని సినిమాలు అంతే. తారక్ ఈ విషయాన్ని చెప్పి మరోసారి రుద్రవీణకు ఉన్న ప్రత్యేకతను పెంచాడు. సినిమా సబ్జెక్ట్ తెలిసినవాళ్లెవరైనా రుద్రవీణను మెచ్చాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story