Bheemla Nayak: భీమ్లా నాయక్ లో పవన్ పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!

Bheemla Nayak: అదృష్ట దేవత తలుపు తడితే అలా పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం వస్తుంది.. నటించాలని ఉన్నా అవకాశాలు రావాలి.. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. వైజాగ్‌లో ఇంజనీరింగ్ పూర్తి సాప్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వర్తిస్తూనే నటించడం పట్ల తనకున్న ప్యాషన్‌తో వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది మౌనికా రెడ్డి.
అమ్మాయి క్యూటు అబ్బాయి నాటుతో మొదటి వెబ్ సిరీస్‌తోనే యువతను ఆకట్టుకుంది. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి వెబ్ సిరీస్ సూర్యలో నటించింది.. ఇది కూడా క్లిక్ అవడంతో వరుస అవకాశాలు, సినిమాలో ఆఫర్లు..ఫుల్ బిజీగా మారిపోయింది మౌనిక. ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ, మోడలింగ్ ఫోటోగ్రాఫ్‌లను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. ఆమె ఇన్‌స్టాఫాలోవర్స్ సంఖ్య 121K ఉందంటే ఎంత పాపులరో తెలిసిపోతుంది.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా, సోనీలైవ్‌లతో కలిసి పనిచేస్తోంది. పెద్ద బ్యానర్‌లలో సినిమా అవకాశాలు వస్తున్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా భీమ్లానాయక్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం.
మొదట పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి చాలా భయపడ్డాను.. ఆ విషయం తెలిసి ఆయనే నాతో మాట్లాడారు అని చెప్పింది మౌనిక. ఆయనతో కలిసి పని చేయడం తన అదష్టంగా భావిస్తున్నానని చెప్పింది. భీమ్లా నాయక్‌లో తనకు చాలా మంచి పాత్ర లభించింది అని తెలిపింది.
తన తదుపరి సినిమాల గురించి చెబుతూ.. నిఖిల్ సిద్ధార్థ '18 పేజీలు', విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' అనే సినిమా చేస్తున్నట్లు చెప్పింది. 'కథ' పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది మౌనిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com