Mamita : ఫుల్ బిజీ.. టాలీవుడ్ కి నో చెబుతున్న మమితా

Mamita : ఫుల్ బిజీ.. టాలీవుడ్ కి నో చెబుతున్న మమితా

మళయాళం మూవీ సర్వోపరి పాలక్కారన్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మమితా బైజు. ఏడేళ్ల క్రితం మాలీవుడ్ లోకి అడుగుపెట్టి దాదాపు 14 సినిమాల దాకా చేసిన ఈ అమ్మడికి.. చెప్పుకోదగ్గ గుర్తింపు అయితే రాలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన ప్రేమలు మూవీతో మాత్రం ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమా భారీ హిట్ కావడంతో సౌత్ ఇండియాలో పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.

దీంతో వరుస అవకాశాలు అందుకుంటోంది. అయితే సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలతో పాటు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఈ బ్యూటీని సంప్రదిస్తున్నారు. తమ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా నటించాలని అడుగుతున్నారట. ఆమెతో కలిసి కథా చర్చలు కూడా జరిపారని టాక్. అయితే ప్రేమలు బ్యూటీ మాత్రం టాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం లేదట.

తానిప్పుడు మలయాళంలో చాలా బిజీగా ఉన్నానని చెప్పేస్తుందట. టాలీవుడ్ సినిమాలు చేయాలని ఉన్నా.. డేట్స్ కుదరక నో చెబుతుందట. కాగా ప్రేమలు ఊహించిన దాని కన్నా ఎక్కువ హిట్ అవ్వడంతో ప్రేమలు 2 సినిమాను రెడీ చేస్తున్నారు మేకర్స్. మరోపక్క మలయాళంలోనే మరిన్ని సినిమాల్లో నటించేందుకు మమితా కమిట్ అయ్యిందట. ఈ గ్యాప్ లో తెలుగు నిర్మాతలుఆఫర్ ఇచ్చినా అమ్మడు కాదనాల్సి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story