Prashant Varma : హనుమాన్‌ చేసిన అద్భుతం.. ప్రశాంత్ వర్మ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

Prashant Varma : హనుమాన్‌ చేసిన అద్భుతం.. ప్రశాంత్ వర్మ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

హనుమాన్ మూవీ ఎంతప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా రిలీజై... దాదాపు రూ.250కోట్లకు పైగా వసూలు చేసి ప్యాన్ ఇండియా లెవెళ్లో సంచలనం సృష్టించింది ఈ సినిమా. హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ దీనిపై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

ఈ సినిమా సాధించిన అఖండ విజయం ఇప్పుడు 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో ఒక థియేటర్ లోనే 100 రోజులు ఓ సినిమా ఆడటం అనేది గగనం అయిపోయింది. అలాంటిది 25 సెంటర్స్ లో హనుమాను రన్ అయ్యి సంచలనం సృష్టించింది. అది కూడా హనుమాన్ జయంతి రోజున వంద రోజులు పూర్తికావడం అనేది ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు.

హనుమాన్ వందరోజుల వేడుకపై ప్రశాంత్ వర్మ స్పెషల్ ప్రెస్ మీట్ పెడుతున్నారు. దీనిపై ఇండస్ట్రీ బజ్ క్రియేట్ అయిఉంది. చాలామంది ఆయన ఏం చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. 'జై హనుమాన్' అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story