Harish Uthaman : మలయాళీ నటితో 'నాంది' నటుడి రెండో పెళ్లి..!

Harish Uthaman : తమిళ నటుడు హరీష్ ఉత్తమన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మలయాళ నటి చిన్ను కురువిల్లతో ఆయన వివాహం నిన్న (జనవరి 20న ) జరిగింది. అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో కేరళ మవెలిక్కరలోని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వీరి వివాహం జరిగింది.
వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హరీష్ ఉత్తమన్, చిన్ను కురువిల్ల గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హరీష్ ఉత్తమన్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే.. శ్రీమంతుడు, అశ్వత్థామ, వి, నాంది చిత్రాలలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.
ఇక అటు చిన్ను కురువిల్ల మలయాళంలో 'నార్త్ 24 కతమ్', 'కసాబా', 'లుక్కా చుప్పి' వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా హరీష్ ఉత్తమన్ కి 2018లో మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌పుర్ తో మొదటి వివాహం జరిగింది. వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఏడాదికే విడిపోయారు.
Happy Married life #HarishUthaman ❤️ #ChinnuKuruvila pic.twitter.com/lsaYAlOQ0k
— Plumeria Movies (@plumeriamovies) January 20, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com