NBK 107 : NBK 107లో హనీ రోజ్.. !

NBK 107 : స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతీహాసన్ నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ని ఫైనల్ చేశారు. ఇందులో ఆమె మీనాక్షి అనే రోల్ లో కనిపించనుంది. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది. హనీ రోజ్ పలు మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది.
తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
అఖండ లాంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలోనే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com