'మా ఊరి పొలిమేర'.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

మా ఊరి పొలిమేర.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
X
టాలీవుడ్ లో తెలుగమ్మాయిల ఎంట్రీ క్రమక్రమంగా పెరుగుతోంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్కర్ల..

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల ఎంట్రీ క్రమక్రమంగా పెరుగుతోంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్కర్ల.. చేసిన రెండు సినిమాలతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది. ప్రియురాలు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కామాక్షి భాస్కర్ల... ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఓ రోల్ చేసింది.


తాజాగా మా ఊరి పొలిమేరా అనే సినిమాలో కమెడియన్ సత్యం రాజేష్ వైఫ్ గా డిగ్లామర్ రోల్ లో ఆదరగోట్టింది. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. త్వరలో రాబోతున్న రౌడీ బాయ్స్ అనే సినిమాలోనూ ఆమె నటిస్తోంది. కామాక్షి వృత్తిరీత్యా డాక్టర్.. ఆ తర్వాత యాక్టర్ అయింది.


చైనాలో మెడిసిన్ చేసి.. అపోలో హాస్పిటల్ లో కూడా కొన్నాళ్లపాటు పనిచేసింది. హీరోయిన్ కాకముందు ఆమె ఓ మోడల్ కూడా.. 2018 ఏడాదికి గానూ మిస్ తెలంగాణగా ఎంపికైంది. ఇదిలావుండగా తన చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదురుకున్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కామాక్షి.


ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో అందాలు అరబోస్తోంది ఈ అమ్మడు.




Tags

Next Story