Sharwanand: అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది.. ఆ సమయంలో.. శర్వానంద్

Sharwanand: అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది.. ఆ సమయంలో.. శర్వానంద్
Sharwanand: సినిమా హిట్టైతే ఎంత ఉత్సాహమో.. ప్లాప్ అయితే అంతే నిరుత్సాహం.. ఎంతో కష్టపడి ఇష్టంగా చేసిన సినిమాని ప్రేక్షకులు ఆదరించరు ఒక్కోసారి. అన్నీ కలిసి వస్తే ఆ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు.

Sharwanand: సినిమా హిట్టైతే ఎంత ఉత్సాహమో.. ప్లాప్ అయితే అంతే నిరుత్సాహం.. ఎంతో కష్టపడి ఇష్టంగా చేసిన సినిమాని ప్రేక్షకులు ఆదరించరు ఒక్కోసారి. అన్నీ కలిసి వస్తే ఆ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసినా కథలో పసలేకపోతే సమస్యే లేదంటారు.. నిర్మొహమాటంగా తిరస్కరించేస్తారు.

తాజాగా నటుడు శర్వానంద్ తాను నటించిన 'ఒకే ఒక జీవితం' విడుదల కానున్న సందర్భంలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు శర్వానంద్. ఇటీవల తాను నటించిన నాలుగు చిత్రాలు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాయని.. ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు.

అయితే 'పడి పడి లేచే మనసు' ఎంతో నమ్మి చేశాను. అది కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో మూడు నెలలు బయటకు రాలేకపోయానన్నారు. 'కో అంటే కోటి' సినిమాకు నిర్మాతగా వ్యవహరించా. సినిమా పోయింది డబ్బులు కూడా పోయాయి. అప్పులు మిగిలాయి. అవి తీర్చడానికి ఆరేళ్లు పట్టింది.

ఆ సమయంలో ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలేదు.. స్నేహితులు, బంధువులు దూరమయ్యారు. అది నాకెంతో బాధగా అనిపించింది. ప్రస్తుతం అప్పులు అన్నీ తీర్చేశాను అని శర్వానంద్ వివరించారు. ఈనెల 9న రిలీజ్ కానున్న ఒకే ఒక జీవితంలో శర్వానంద్‌తో పాటు రీతూ వర్మ నటిస్తోంది. అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటించనుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story