No Stay on Malli Pelli: నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం

No Stay on Malli Pelli: నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై  నిషేధం
నరేష్ మాజీ భార్యకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు..

టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ మరోసారి వార్తల్లో కెక్కారు. ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి 'మళ్ళీ పెళ్లి' (తెలుగు), 'మట్టే మదువే'(కన్నడ) చిత్రాన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు. దీంతో ఈ వివాదం మరోసారి సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేస్తూ.. ఆగస్టు 1న తీర్పును వెలువరించింది.

సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది, బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇక కోర్టు రీసెంట్ గా ఇచ్చిన తీర్పుతో మళ్లీ పెళ్లి మేకర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా తెలుగు, కన్నడ భాషలలో సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తీర్పు ప్రకారం ఈ సినిమాను అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా నిర్మాతలు స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చు.

ఇక మరో కేసులోనూ నరేష్ అతని కుటుంబ సభ్యులు ఆయన భార్య రమ్య రఘుపతికి వ్యతిరేకంగా వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నానక్‌రామ్‌గూడలోని తన ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఈ దావాను వేశారు. అయితే అంతకుముందు రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతి పై గృహ నిషేదం ప్రకటించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేదం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలే రమ్య రఘుపతి.. పవర్ టీవీ అనే కన్నడ ఛానల్ చేత ఇల్లీగల్ గా నరేష్ ఇంటి మీద, పవిత్ర మీద స్టింగ్ ఆపరేషన్ లు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని నిర్ధారించింది. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది. కానీ నరేష్, రమ్యలు 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని తేల్చడంతో విడాకులకు మార్గం సులభమైంది. ఇదిలా ఉండగా రమ్య రఘుపతి పై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్ కు సంబంధించి ఓ క్రైమ్ కేసు ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story