Record : రికార్డు క్రియేట్ చేసిన మహేష్, జక్కన్న

Record : రికార్డు క్రియేట్ చేసిన మహేష్, జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంటుంది. దీంతో మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీకి సంబంధించిన ఎన్నో వార్తలు నెటింట వైరల్ గా మారాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమా ఉండనుందని టాక్. ఈ అప్ కమింగ్ సినిమా కొత్త రేర్ రికార్డును సృష్టించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతవరకు ఏమూవీకి రానన్ని రూమర్స్ ఈ మూవీకే రావడం విశేషం.

రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలని ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ స్టూడియోతో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయనున్నారట. ఇప్పటివరకు వచ్చే అన్ని సినిమాలలోకెల్లా అత్యధిక రూమర్స్ వచ్చిన మూవీగా మహేష్ - జక్కన్న కాంబో రికార్డ్ క్రియేట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story