Theater Business : థియేటర్ బిజినెస్.. మహేశ్ బాబుతో చేతులు కలిపిన మరో బడా హీరో!

Theater Business : థియేటర్ బిజినెస్.. మహేశ్ బాబుతో చేతులు కలిపిన మరో బడా హీరో!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) థియేటర్ బిజినెస్ లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితమే ఏషియన్ సంస్థతో కలిపి "ఏఎంబీ" థియేటర్ ను కూడా స్థాపించి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఇక హైదరాబాద్ నగరంలో ఈ థియేటర్ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ మరో థియేటర్ ను కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుప్రసిద్ధ సుదర్శన్ థియేటర్ ను మోడ్రనైజ్ చేస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో మల్టీ ప్లెక్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ మోడ్రనైజేషన్ బిజినెస్ లోకి ఏషియన్ గ్రూప్, మహేష్ బాబు తో పాటు మరో టాలీవుడ్ స్టార్ హీరో కూడా పార్టనర్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

విక్టరీ వెంకటేష్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారని ఇండస్ట్రీ టాక్. ఏఎంబీ విక్టరీ పేరుతో ఈ కొత్త మల్టీప్లెక్స్ లాంచ్ చేస్తారని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story