'చిరు' రిక్షా చతికిలబడింది.. 'నారాయణరావు' రిక్షా పరుగు తీసింది..
చిరంజీవి సోలో హీరోగా ఎదుగుతూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన చేస్తున్న బ్రేక్ డ్యాన్సులకు థియేటర్లు షేక్ అయ్యేవి. చిరు చిత్రం వస్తుందంటే మెగాస్టార్ అభిమానులకు పండగే.. కటౌట్లు, బ్యానర్లతో హడావిడి. ఎన్నో ఆశలు పెట్టుకుని కోడిరామకృష్ణ డైరెక్షన్‌లో రిక్షావోడు చేసారు చిరంజీవి.
అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం, గూఢచారి నెం.1, సింహపురి సింహం లాంటి చిత్రాలు వచ్చాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత 1995 డిసెంబర్ 14న చిరుతో రిక్షావోడు తీసారు కోడి రామకృష్ణ. ఆ చిత్రంలో నగ్మ, సౌందర్య హీరోయిన్లు.
అదే సంవత్సరం నవంబర్ 9న నారాయణరావుని హీరోగా పెట్టి దర్శక రత్న దాసరి ఒరేయ్ రిక్షా తీశారు. హీరోయిన్ రవళి నారాయణరావుకి జోడీగా నటించింది. చెల్లెలి సెంటిమెంట్ ప్రధానాంశంగా తీసుకుని చిత్రాన్ని రూపొందించారు దాసరి. అన్నగా ఆర్ నారాయణమూర్తి అద్భుతంగా నటించారు. దాసరి కూడా చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో హిట్ కొట్టారు.
ఇటు నారాయణమూర్తి రిక్షా, అటు చిరంజీవి రిక్షా.. రెండు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. ఈ రెండు చిత్రాలు రిక్షా అనే టైటిల్‌తో రావడంతో ప్రేక్షులతో పాటు పరిశ్రమలోనూ ఉత్కంఠత నెలకొంది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ రిక్షా మాత్రం వెనకబడింది. అనూహ్యంగా నారాయణ రావు రిక్షా పరుగందుకుంది.. బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com