RRR Movie: 50 డేస్.. 500 సెంటర్స్...!

RRR Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం).. భారీ అంచనాల నడుమ ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్ల పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది.
తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన సరికొత్త పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన, రాజమౌళి టేకింగ్ హైలెట్ అయి సూపర్ టాక్ తెచ్చుకుంది.
కాగా ఈ సినిమా ఈనెల మే 20 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ బాషల్లో ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. RRR హిందీ వెర్షన్ అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కాగా RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా ఈ మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com