RGV : నాలా బతకాలనుకుంటే ఆ మూడు వదిలేయాలి : రామ్ గోపాల్ వర్మ
RGV : తనలా బతకాలనుకుంటే దైవం, సమాజం, ఫ్యామిలీ వదిలేయాలని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆయన తెరకెక్కించిన 'మా ఇష్టం' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్స్.. నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి 'ఆలీతో సరదాగా' పాల్గొని సందడి చేశారు వర్మ.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఫీల్ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకొని, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని అన్నారు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి పట్టించుకొనని, నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోతానని చెప్పుకొచ్చాడు. ఇక తనకు నచ్చిన కథలను సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్‌లకు వెళ్లి చూడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టమని తెలిపాడు.
గత 20 సంవత్సరాలుగా తనకి ఇష్టం వచ్చినట్లుగా బతుకున్నానని తెలిపాడు. ఇక రాజకీయాల్లోకి వస్తే ఒక్కరు కూడా తనకి ఓటు వెయ్యరని ఎందుకంటే తాను ముఖ్యమంత్రి అయితే డబ్బంతా తీసుకుని విదేశాలకు వెళ్లిపోతానని నవ్వులు పూయించాడు. బర్త్‌డే పార్టీలు చేసుకోవడం ఇష్టం ఉండదని, కానీ కొందరు అమ్మాయిలు తనకు బర్త్‌డే పార్టీలు ఇస్తుంటే కాదనలేకపోతున్నానని తెలిపాడు.
అటు గతంలో తన దర్శకత్వంలో వచ్చిన 'వంగవీటి' సినిమా ఆడియో వేడుకలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి వివరించారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com