RRR Movie : నైజాంలో రూ.100 కోట్లు...చరిత్ర సృష్టించిన RRR

RRR Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్.. భారీ అంచనాల నడుమ గత నెల మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది.
తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నైజాం(తెలంగాణ) ఏరియాలో రూ. 100 కోట్ల షేర్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి వందకోట్లు సాధించిన ఏకైక చిత్రంగా నిలిచింది. 12 వ రోజు రూ. 2.12 కోట్ల షేర్‌తో మొత్తంగా రూ. 101.29 కోట్లు పొందింది.
ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోగా, ఆయనకీ రూ. 30 కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్‌కి దిల్ రాజు కూడా భారీగా పార్టీ కూడా ఇచ్చారు. కాగా RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిగా ఈ మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు.
వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com