Salaar 2 Update : 'సలార్ 2'.. ఫ్యాన్స్ కు బిగ్ అప్ డేట్

Salaar 2 Update : సలార్ 2.. ఫ్యాన్స్ కు బిగ్ అప్ డేట్

ప్యానిండియా స్టార్ ప్రభాస్ సలార్ 2 మూవీ షూట్ కు రెడీ అయ్యారు. గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్నటి వరకూ 'కల్కి'తో బిజీగా ఉన్న ప్రభాస్‌, ఆ తరవాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు ఇచ్చాడు. ఇప్పుడు 'సలార్ 2' మీద దృష్టి పెట్టాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన 'సలార్‌' సూపర్ హిట్టయ్యింది. పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కొంత మేర జరిగింది. మిగిలిన భాగాన్ని ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఈనెలాఖరు నుంచి 'సలార్ 2' షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు నెల రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటనీ తెరకెక్కిస్తారని సమాచారం.

'సలార్ 2' షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ఈ యేడాది చివర్లోనే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలోని సినిమా పట్టాలెక్కబోతోంది. 'సలార్ 2'ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీల్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. డిసెంబరులో 'సలార్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. జులై 5న సలార్ ను జపాన్ లో రిలీజ్ చేసే చాన్స్ ఉంది. బాహుబలి క్రేజ్ ను సలార్ తో క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story