Salaar 2 : సలార్ 2కు రిస్క్ తప్పదా!

Salaar 2 : సలార్ 2కు రిస్క్ తప్పదా!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డెరెక్షన్ లో తెరకెక్కిన మూవీ సలార్. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. మూవీ టీం వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేయగా.. ఆ టార్గెట్ ని సలార్ రీచ్ కాలేకపోయింది. ఈ సినిమాకు పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ కావడంతో.. ఆ సినిమా ఇంపాక్ట్ సలార్ కలెక్షన్స్ పై పడింది. సినిమా సైతం ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇదే క్రమంలో డైరెక్షర్ ప్రశాంత్ నీల్ సలార్ 2ని కూడా తెరకెక్కిం చనున్నట్లు ప్రకటించాడు. దీంతో సలార్ 2 పై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే సలార్ క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా విడిచి పెట్టాడు. దీంతో పార్ట్ 2 కచ్చితంగా హై లెవెల్లో డిజైన్ చేయాలని అనుకుంటున్నాడట. దీనికి బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుందని తెలుస్తోంది.

అయితే ఇంత ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారని సమాచారం. మరి బడ్జెట్ విషయంలోనే దర్శక, నిర్మాతల మధ్య చర్చల కారణంగా మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఇదే సమయంలో మూవీ టీం సలార్ 2 తెరకెక్కించడం, దాన్ని సినీ ప్రేక్షకులను ఆకట్టుకునెలా రూపొందించడం కాస్త రిస్క్ తో కూడుకున్న పనిలా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story