ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు

ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విశాఖ పట్నం నుంచి వస్తూ అనారోగ్యానికి గురవగా సమీహ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు హైదరాబాద్ లో అంత్య క్రియలు జరుగనున్నాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

రాకేష్ మాస్టర్ పూర్తి పేరు ఎస్. రామారావు. వీరు 1968 సంవత్సరంలో తిరుపతిలో జన్మించాడు. డ్యాన్స్ మీద మక్కువతో హైదరాబాద్ కు వచ్చి ముక్కురాజు మాస్టర్ వద్ద శిష్యరికం చేశారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు. అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నాడు. 2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story