Sarath : టాలీవుడ్‌‌లో మరో విషాదం... క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sarath :  టాలీవుడ్‌‌లో మరో విషాదం... క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Sarath : టాలీవుడ్‌‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు.

Sarath : టాలీవుడ్‌‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు మహప్రస్థానంలో జరగనున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దర్శకుడు శరత్ తెలుగులో 20కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించారు. బాల‌కృష్ణతో `వంశాని కొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధార‌కుడు` సినిమాలు తీశాడు. సుమ‌న్‌‌తో `చాద‌స్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ‌-బావ‌మ‌రిది, చిన్నల్లుడు` సినిమాలను తీశారు. శరత్ మృతి పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story