ఒకేరోజున ఒకే కథతో పోటీపడ్డ బాలయ్య, వెంకీ.. !
సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు తమ సినిమాలను ఒకేరోజున రిలీజ్ చేయడం సహజం.. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలతో ఒకేరోజున పోటీపడిన సందర్బాలు కోకొల్లలు.. కానీ ఒకే కథతో ఉన్న రెండు సినిమాలు ఒకేరోజున విడుదలవ్వడం మాత్రం చాలా అరుదు.. ఇలాంటి సంఘటనే ఒకటి 1989లో జరిగింది.
1989లో ముద్దుల మావయ్య సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన బాలకృష్ణ తన తదుపరి చిత్రంగా అశోక చక్రవర్తి అనే సినిమాని చేశారు. ఇందులో బాలకృష్ణ సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది. మలయాళంలో హిట్టైన ఆర్యన్ సినిమాకి ఇది రీమేక్.. ఇక ఒంటరి పోరాటం సినిమాతో మంచి హిట్ కొట్టిన వెంకటేష్.. ఆ తర్వాత ధృవనక్షత్రం అనే సినిమాని చేశాడు.
అయితే యాదృచ్చికంగా ఈ రెండు సినిమాలు ఒకే రోజున (29 June 1989)విడుదలయ్యాయి. అయితే ఇందులో అశోక చక్రవర్తి డిజాస్టర్ కాగా అదేరోజు విడుదలైన ధ్రువ నక్షత్రం మాత్రం సూపర్ హిట్ అయింది. ఇక్కడో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకి పరిచురి బ్రదర్స్ రచయతలు కావడం విశేషం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com