Pushpa keshava : పక్కా తెలంగాణ కుర్రాడే.. చిత్తూరు యాసలో అదరగొట్టాడు.. ఎవరీ పుష్ప కేశవ?
Pushpa Keshava : పాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళతో దూసుకుపోతుంది. ఇదిలావుండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత అతని ఫ్రెండ్ గురించే ఎక్కువగా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
కేశవ పాత్రలో, చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరగొట్టాడు.. అతని పేరు జగదీష్ ప్రతాప్ బండారి.. పక్కా తెలంగాణ కుర్రాడు.. పుట్టింది పెరిగిందంతా జయశంకర్ భూపాలపల్లిలో.. వరంగల్‌లో చదువుకున్నా జగదీష్‌కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేదట.. ముందుగా ఫిలిమ్ మేకర్ కావాలని అనుకున్నాడట.. ఫిలిమ్ మేకర్ కావడానికి దర్శకుడు ఆర్జీవీ తనకి స్ఫూర్తి అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
కానీ నిరుద్యోగ నటులు షార్ట్ ఫిలిమ్‌తో నటుడిగా మారానని తెలిపాడు. ఈ షార్ట్ ఫిల్మ్ బాగా క్లిక్ అవ్వడంతో మల్లేశం, పలాస సినిమా అవకాశాలు వచ్చాయట.. పలాస సినిమాని చూసిన దర్శకుడు సుకుమార్.. జగదీష్‌కి పుష్పలో కేశవ క్యారెక్టర్ ఇచ్చారట.. అయితే ఆడిషన్స్‌లో సెలక్ట్ అయినప్పుడు తనకి ఇంత పెద్ద రోల్ దక్కుతుందని అనుకోలేదని ఇలాంటి రోల్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు.
ఇక ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు కోసం ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడ్డానని తెలిపాడు. ఇప్పుడు పుష్ప రూపంలో జగదీశ్ కి మంచి ఫేమ్ అయితే వచ్చింది. మరి ఈ ఫేమ్ తో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com