leopard attack : తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి.. పరామర్శించిన TTD ఛైర్మన్ సుబ్బారెడ్డి

leopard attack : తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి.. పరామర్శించిన TTD ఛైర్మన్ సుబ్బారెడ్డి
చిరుత దాడిలో గాయపడ్డ బాలుడిని పరామర్శించిన TTD ఛైర్మన్ సుబ్బారెడ్డి


తిరుమలలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాలి నడక మార్గంలో దర్శనానికి వెళ్తున్నవారిపై చిరుత ఒక్క ఉదుటున దాడి చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన TTD ఛైర్మన్ YV సుబ్బారెడ్డి.

గోవింద నామాలు స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి సంతోషంగా బయల్దేరింది ఆదోనికి చేందిన ఓ కుటుంబం. గురువారం అలిపిరి నడక మార్గం గుండా కొండపైకి వెళ్తున్న వారు ఏడో మైలు వద్దకు చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో వారిపై ఒక్కసారిగా చిరుత పంజా విసిరింది, ఐదేళ్ల చిన్నారిని అమాంతం అందుకుంది. క్షణాల్లో పొంచుకొచ్చిన ప్రమాదాన్ని చూసి వణికిపోయిన బాలుడు గట్టి గట్టిగా కేకలు వేయటంతో విజిలెన్స్ సిబ్బంది బయటకు వచ్చారు.

ఈ ఘటన క్షణాల్లోని జరిగిపోయిందని TTD అధికారులు పేర్కొన్నారు, బాలుడిని వైద్యం కోసం చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎంత ఖర్చైనా చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

‘ క్షణాల్లో ఘటన జరిగిపోయింది. నడక మార్గంలోని విజిలెన్స్‌ పోలీసులు సకాలంలో స్పందించి బాలుడిని రక్షించారు. వెంకటేశుని ఆశీర్వాదంతో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. నడక మార్గంలో మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతాం. ‘ - వైవీ.సుబ్బారెడ్డి, TTD ఛైర్మన్


Tags

Read MoreRead Less
Next Story