Dera Baba Arrest: లైంగిక వేధింపుల కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు..

Dera Baba (tv5news.in)
Dera Baba Arrest: డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకేసులో దోషీగా తేల్చింది. డేరా బాబాతో పాటు మరో నలుగురికి జీవితకాల శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. అలాగే డేరా బాబాకు 31 లక్షల జరిమానా విధించింది.
సచ్చా సౌధా సంస్థ నిర్వాహకులు డేరా బాబా వద్ద మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు. హర్యానాలోని థానేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఆయన హత్య జరిగింది. భక్తులపై లైంగిక వేధింపులను బట్టబయలు చేసినందుకే రంజిత్ సింగ్‌ను హత్య చేశారని డేరాబాబాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మర్డర్, కుట్ర అభియోగాల కింద డేరాబాబాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2003లో ఈ కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించింది. తాజాగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబాను దోషీగా తేల్చింది.
భక్తి ముసుగులో డేరా బాబా చేస్తున్న అరాచకాలు, అఘాయిత్యాలు వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ ఆ తర్వాత హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కేసులోనూ డేరా బాబా దోషిగా ఉన్నారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో దోషీగా తేలి డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com