Khedi Karam: మూడు నెలల్లో ఏడు పెళ్లిళ్లు.. లేడీ ఖిలాడి నిర్వాకం..
Khedi Karam: దొంగతనాలు చేయడంలో కూడా దొంగల స్టైలే మారిపోయింది. ఒకప్పటిలాగా ప్లానింగ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయడం మానేసి ఒక ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు దొంగలు. అదే విధంగా దొంగతనాల కోసం నిత్యపెళ్లికూతురిలాగా మారిపోయింది ఓ యువతి. మామూలుగా నిత్యపెళ్లికొడుకు గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ ఈ నిత్యపెళ్లికూతురు మాత్రం మూడు నెల్లలో ఏకంగా ఏడుగురిని వివాహం చేసుకుంది.
అనాథ అని చెప్పి పురుషులతో స్నేహం ఏర్పరుచుకోవడం.. ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చి పెళ్లి వరకు తీసుకెళ్లడం.. పెళ్లయిన మొదటి రాత్రే భర్తకు మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే డబ్బు, నగలను దోపిడీ చేసి పారిపోవడం. ఇదే ఈ ఖిలాడీ లేడీ ప్లాన్. ఇదే ప్లాన్‌తో మూడు నెల్లలో ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా పోలీసులకు చిక్కిన ఈ ఖిలాడీ పేరు ఖేడీ కరమ్.
మామూలుగా అందరితో ఒక రకమైన స్క్రిప్ట్‌ను ఫాలో అయ్యి దోపిడీకి పాల్పడుతుంది కరమ్. ఒకవేళ అది కాస్త రివర్స్ అయితే మాత్రం భర్తపై వరకట్న వేధింపులు అని చెప్పి డబ్బు లాగుతుంది. ఈ క్రైమ్‌లో కరమ్‌కు ఒక టీమ్ కూడా ఉంది. అందులో ఓ మ్యారేజ్ ఏజెంట్, నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇటీవల కరమ్ నాలుగో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చి పోలీసులు కరమ్‌ను, తన టీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com