అదిరిందయ్యా బండి.. సెల్ఫ్ బ్యాలెన్స్.. స్టాండ్‌తో పన్లేదు..

అదిరిందయ్యా బండి.. సెల్ఫ్ బ్యాలెన్స్.. స్టాండ్‌తో పన్లేదు..

చిత్రం.. భళారే విచిత్రం.. మాయల్లేవు.. మంత్రాల్లేవు.. అంతా టెక్నాలజీ మహిమ. బుద్ది ఉండాలే కానీ బుర్రకి పదును పెడితే బోలెడన్ని ఐడియాలు. గాల్లో ఎగిరే కార్లు, స్టాండ్ వెయ్యకుండానే నిలబడే బండ్లు.. ఒక్కటేమిటి అన్నీ సాధ్యమే. ఓర్నీ అసాధ్యం కూలా.. అనే తాతగారికి సరైన సమాధానం చెబుతున్నారు నేటి యువ ఇంజనీర్లు.

మద్రాస్, ఖరగ్‌పూర్‌లలో ఐఐటీ పట్టభద్రులైన వికాస్ పొద్దార్, అశుతోష్ ఉపాధ్యాయ్‌లు ఈ స్కూటీని రూపొందించారు. బల్లాస్ ఆల్గరిథమ్ ఆధారంగా ఈ స్కూటీ నడుస్తుంది. చిన్న చిన్న చక్రాలు, గుండ్రని బ్రేరింగ్‌లు, స్పెన్సర్ల ఆధారంగా ఇది పని చేస్తుందని అన్నారు. స్కూటీ అడుగు భాగంలో ఉన్న రెండు చక్రాలను కలుపుతూ బిగించే ఒక సెటప్‌లోనే ఉంటుంది మొత్తం మెకానిజం. ఈ స్కూటీకి ఉన్న మరో స్పెషాలిటీ ఏమిటంటే.. వాయిస్ కమాండ్ ఆధారంగా పని చేస్తుంది. 'గో' అంటే ముందుకెళ్తుంది.. రివర్స్ అంటే వెనక్కి వస్తుంది. ఇంజిన్ ఆఫ్ చేసి, వదిలేస్తే పార్కింగ్ చేసినట్లుగా ఉండిపోతుంది. ఈ టెక్నాలజీని మామూలు స్కూటీల్లోనూ బిగించుకోవచ్చు. కాకపోతే ఓ అయిదు వేలు అదనంగా ఖర్చవుతాయి అంతే అని అంటున్నారు తయారీ దారులు.

రెండేళ్లు శ్రమించి.. వేల సార్లు కోడింగ్ రాసి ఈ కొత్త టెక్నాలజీని కనిపెట్టారు వీళ్లు. గతంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు.. యమహా, హోండాలు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్‌లను రూపొందించాలని ప్రయత్నించినా అవి ప్రయోగాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ బండికి ఉన్న మరికొన్ని ఉపయోగాలు.. బండి నడుపుతుండగా కింద పడే అవకాశం తక్కువ. నడిపే వారికి దెబ్బలు తగలవు.. వాహనమూ దెబ్బతినదు. రిపేర్ ఖర్చు కూడా తక్కువ. నిటారుగా పార్కింగ్ చేయొచ్చు కాబట్టి ఎక్కువ స్పేస్ అవసరం ఉండదు. దివ్యాంగులకు, వృద్దులకు, కొత్తగా బండి నడిపే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బండి నడపడం చాలా తేలిక అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story