బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ చేస్తున్నారా? అలా చేయకండి..ఎందుకంటే..?
Mouthwash: కొంత మంది బ్రష్ చేసుకొవడం 5 నిమిషాల్లో ముగిస్తారు. మరికొందరు ఎక్కవ టైం తీసుకుంటారు. అయితే పళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. కానీ, బ్రష్ చేసిన అనంతరం నోరు ఫ్రెష్‌గా ఉండేందుకు కూడా పుక్కిలిస్తుంటారు('మౌత్ వాష్') చాలా మంది. ఇది ఎంత మాత్రం శ్రేయస్కారం కాదని అలా పళ్లు తోమిన వెంటనే 'మౌత్ వాష్' చేయకుడదని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోవాలని లండన్‌కు చెందిన దంత వైద్యులు సూచిస్తున్నారు.
లండన్‌కు చెందిన డెంటిస్టు .. వీడియో ద్వారా పలు దంత సమస్యలపై సలహాలు, సూచనలు ఇస్తోంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సూచనలు విన్న నెటిజన్లను ఆశ్చర్యపొతున్నారు. బ్రష్ తర్వాత నోటిని పుక్కిలించడం దంతాల్లోని జీవ కణజాలం కుళ్లిపోయి దంతక్షయం ఏర్పడుతుందని, వెంటనే ఆ అలవాటు మానుకోండని ఆమె సూచించింది.
''మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల దంతక్షయం నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, బ్రష్ చేసిన తర్వాత మాత్రం దాన్ని వాడొద్దు. దానివల్ల మీ దంతాలపై ఉండే టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. మౌత్ వాష్‌లో ఉండే ఫ్లోరైడ్ రోజంతా మీరు తినే ఆహారంలోని క్రిముల నుంచి రక్షణ కల్పించలేదు'' అని NHS పేర్కొంది. వైద్యురాలు చెప్పిన ఈ విషయానికి యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) సైతం మద్దతు తెలిపింది.
ఆమె చెప్పిన వివరాలు చూస్తే.. టూత్ పేస్టులో 1450pp ఫ్లోరైడ్ ఉంటుంది. అయితే మీరు మౌత్ వాష్‌లో 220pp ఫ్లోరైడ్ మాత్రమే ఉంటుంది. తక్కువ స్థాయిలో ఉండే ఫ్లోరైడ్.. మీరు తినే ఆహారం, తాగే పానీయాల్లో ఉండే చక్కెర వల్ల దంతాలకు కలిగే నష్టాన్ని అడ్డుకోలేదు. మీరు నోటిని మౌత్ వాష్‌తో శుభ్రం చేస్తే దంతాలపై గల ఫ్లోరైడ్ శాతం తగ్గిపోతుంది. కేవలంలో మౌత్ వాష్‌లో ఉండే తక్కువ స్థాయి ఫ్లోరైడ్ మాత్రమే మిగులుతుంది'' అని పీటర్సన్ తెలిపింది. హారంలోని చక్కెర్లు దంతాల్లో తిష్ట వేస్తాయి. వాటిని తొలగించేందుకు మౌత్ వాష్ ఉపయోగపడుతుంది. మీరు బ్రష్ చేసిన వెంటనే కాకుండా మధ్యాహ్నం భోజనం తర్వాత మౌత్ వాష్ చేయడం మంచిది.
ఈ సందర్భాల్లో మౌత్ వాష్ చేయండి
* మధ్యాహ్నం భోజనం తర్వాత మౌత్ వాష్ చేయాలి
* భోజనం తిన్న తర్వాత ఆహారంలోని చక్కెర నోట్లో క్రమేనా ఆమ్లంగా మారుతుంది.
తిన్న తర్వాత బ్రష్ చేస్తే ఆ ఆమ్లం నోరంతా చేరి PH స్థాయిలు తగ్గిస్తుంది.
*ఫ్లోరైడ్ మౌత్ వాష్ ఉపయోగించిన 30 నిమిషాల వరకు ఏమీ తాగొద్దు, తినొద్దు.
*దంతాలపై PH స్థాయిలు తగ్గిపోతే అరిగిపోతాయి. దీన్నే దంతాల కోత (tooth erosion) అని కూడా అంటారు.
*నోట్లో PH స్థాయిలు 5.5 కంటే తక్కువగా ఉంటే 'యాసిడ్ ఎటాక్'గా చెప్తున్నారు.
*రాత్రి భోజనం తర్వాత, నిద్రపోయే ముందు మౌత్ వాష్ చేసుకోవడం మంచిదే.
*30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది
Also Read: ట్రెండ్ సెట్ చేయాలనీ అనుకుంది... కానీ పోలీసులకి అడ్డంగా దొరికిపోయింది..!
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com