అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినోత్సవం: నిర్లక్ష్యం చేయకూడని 5 ప్రధాన సంకేతాలు

అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినోత్సవం: నిర్లక్ష్యం చేయకూడని 5 ప్రధాన సంకేతాలు
ప్రపంచవ్యాప్తంగా, ప్రతిరోజూ 1000 మందికి పైగా పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

అంతర్జాతీయ బాలల క్యాన్సర్ దినోత్సవం: నిర్లక్ష్యం చేయకూడని 5 ప్రధాన సంకేతాలు

ప్రపంచవ్యాప్తంగా, ప్రతిరోజూ 1000 మందికి పైగా పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవలి సర్వే ప్రకారం అధిక-ఆదాయ వనరులున్న దేశాలలో 80% కంటే ఎక్కువ మంది పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మధ్య-ఆదాయ వనరులన్న దేశాలలో 20% మంది పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది.

బాల్య క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనగా మారుతోంది.

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. సకాలంలో సరైన చికిత్స పొందితే మరణాలను నివారించవచ్చు. చిన్నారులలో వచ్చే క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు, నివారణ గురించి అవగాహన మరియు జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, "బాల్యంలో వచ్చే క్యాన్సర్లలో అత్యంత సాధారణ రకాలు లుకేమియాలు, మెదడు క్యాన్సర్‌లు, లింఫోమాలు, న్యూరోబ్లాస్టోమా, విల్మ్స్ ట్యూమర్‌ల వంటి కణితులు."

ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఇలాంటి చిన్ని హృదయాలను చూడటం బాధాకరమైన అంశం. రోగనిర్ధారణ మరియు చికిత్సకు సంబంధించిన బాధ హృదయాన్ని కదిలిస్తుంది.

క్యాన్సర్ లక్షణాలు: పిల్లలలో కణితి అభివృద్ధి చెందడానికి 5 సంకేతాలు

బరువు తగ్గడం : బరువు తగ్గడం అనేది శరీరం లోపల ఏదో ఒక అవయవం పని చేయడం లేదు అనేదానికి సూచన. సకాలంలో వైద్యుని సంప్రదించడం అవసరం.

తలనొప్పి, వికారం: జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డిజిటల్ ప్రపంచం కళ్ళు మరియు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. చిన్నారులు తలనొప్పి, వికారం గురించి తరచు ఫిర్యాదు చేస్తుంటే, దానిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు.

వాపు: క్యాన్సర్ యొక్క మరొక హెచ్చరిక సంకేతం కీళ్లలో ఆకస్మిక వాపు. ఇతర సంకేతాలతో కలిపి ఉన్నప్పుడు, రోగనిర్ధారణ చేయించుకోవడం అత్యవసరం.

అలసట: పిల్లలు చీటికి మాటికి అలసటకు గురైతే అశ్రద్ధ చేయకూడదు. బద్ధకం, నీరసం సర్వసాధారణమే అని భావించినా దాన్ని విస్మరించవద్దు. అంతర్లీనంగా ఏదో సమస్య ఉంది కాబట్టే ఇలా ఉన్నారేమో అని అర్ధం చేసుకోవాలి. క్యాన్సర్ మాత్రమే కాదు, అనేక పోషకాలు మరియు విటమిన్ లోపాల వలన కూడా పిల్లలు త్వరగా అలసటకు గురవుతారు. ఏదేమైనా ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది.

గడ్డలు: శరీరంలోని ఏదైనా భాగంలో గడ్డలు ఏర్పడటం ప్రధాన హెచ్చరిక. అటువంటి పరిస్థితిలో భయాందోళనలకు గురవకుండా వైద్యుడి పర్యవేక్షణలో నిర్ధారించుకోవాలి.

ఈ కొన్ని సంకేతాల కలయిక క్యాన్సర్‌ను సూచిస్తుందని గమనించడం ముఖ్యం. అందువల్ల, మీ పిల్లల ఆరోగ్యం మరియు శారీరక మార్పులను నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఇవి కాకుండా, కండరాలలో నొప్పి, కంటి చూపులో మార్పులు కూడా కొన్ని నిర్దిష్ట లక్షణాలు.

Tags

Read MoreRead Less
Next Story