హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది.. ఇకపై..

హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది. ఆ ప్రాంతానికి కళ్యాణ కర్ణాటక అని కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం ప్రకటించారు. బుధవారం నుంచి హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌ను కళ్యాణ కర్ణాటక రీజియన్‌గా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ కర్నాటక రీజియన్‌లో ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కర్నాటకలో 6 రీజియన్‌లు ఉన్నాయి. బెంగళూరు, ఉత్తర కర్నాటక, కోస్తా కర్ణాటక, పాత మైసూరు, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలుగా విభజించారు. ఇందులో హైదరాబాద్-కర్ణాటక చాలా కీలకం. ఈ రీజియన్‌లో బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయ్‌చూర్, కొప్పళ్, బళ్లారిలతో కూడిన ఈ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఈ ఆరు జిల్లాలను మాత్రం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు. దశాబ్దాల ఆ పిలుపునకు యడియూరప్ప సర్కారు చరమగీతం పాడింది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

దళితులు రావడానికి వీల్లేదని లోక్‌సభ సభ్యుడినే అడ్డుకున్న..

Wed Sep 18 , 2019
ఆధునిక కాలంలోనూ కుల రక్కసి కాటు వేస్తోంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా కులోన్మాదం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంపీ ఎ.నారాయణ స్వామి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బీజేపీ సీనియర్ నేత ఎ.నారాయణ స్వామి కర్నాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దళిత నాయకుడైన నారాయణ స్వామి తుమకూరు జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించడానికి వెళ్లారు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దళితుడంటూ నారాయణ స్వామిని గ్రామస్థులు […]