Maharastra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు

Maharastra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు
Maharastra: మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తీసుకునేలా కనిపిస్తున్నాయి.. సీఎం ఏక్‌నాథ్‌షిండే వర్గంలో అప్పుడే లుకలుకలు మొదలైయ్యాయి.

Maharastra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తీసుకునేలా కనిపిస్తున్నాయి.. సీఎం ఏక్‌నాథ్‌షిండే వర్గంలో అప్పుడే లుకలుకలు మొదలైయ్యాయి..ఏకంగా సీఎం సీటుకే ఎసరు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు శివసేన అధికార పత్రిక సామ్నాలో కధనాలు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో కుదుపు తప్పదని రాజకీయ విశ్లేషకులు అనలైజ్‌ చేస్తున్నారు.

మరోవైపు ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు ఓ కధనం ప్రచురించింది సామ్నా. ఏక్‌నాథ్‌ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని, షిండే సీఎం పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైందని.. అందుకే అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం ఉపఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావిస్తున్నట్లు సామ్నా రోక్‌ఠోక్‌లో ప్రచురించింది.

ఇక ఏక్‌నాథ్‌ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు గాలికి వదిలిపెట్టరని ఉద్దవ్‌ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన విమర్శలు చేసింది.షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటున్నారంటూ ఓ బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ ఓ కధనం ప్రచురించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని, నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండేతో ప్రకటిస్తున్నారని ఆరోపించింది శివసేన.

Tags

Read MoreRead Less
Next Story