ఎడ్లబండికి రూ.1000ల ఫైన్.. ఎక్కడో తెలుసా?

ఎడ్లబండికి రూ.1000ల ఫైన్.. ఎక్కడో తెలుసా?

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. బండికి సంబంధించినపేపర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. అన్నిటికీ మించి హెల్మెట్ పెట్టుకోవాలి. లేదంటే మీ జేబుకు చిల్లే. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్ల మీద ఫైన్లు వేస్తూ వాహన దారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బండి తీయాలంటే భయం వేస్తోంది నగర పౌరులకి. ఒకటికి రెండు సార్లు అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని వాహనం తీస్తున్నారు. ఆటో డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని ఒకచోట ఫైన్ వేస్తే, కారులో ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని మరో చోట ఫైన్ వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీటన్నిటికంటే విచిత్రం ఎడ్ల బండికి రూ.1000 జరిమానా విధించడం. ఉత్తరాఖండ్‌‌కు చెందిన ఓ ఎడ్ల బండి యజమాని రియాజ్ హసన్ అనే రైతు ఇసుకను తీసుకుని వెళుతున్నారు. అయితే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని భావించిన ట్రాఫిక్ పోలీస్ రియాజ్ ఇంటికి చలాన్ పంపించారు. ఎడ్లబండి కూడా మోటారు వాహనాల చట్టం పరిధిలోకి వస్తుందా అంటూ రియాజ్ వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు దాన్ని రద్దు చేశారు. డబ్బు చెల్లించే ఇసుకను కొనుగోలు చేశానని రియాజ్ వివరణ ఇచ్చుకున్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా చూపించారు.

Tags

Read MoreRead Less
Next Story