ఎవరూ అభివృద్ధి చేయలేదని.. ఏకంగా బిచ్చగాడిని ఎన్నికల బరిలో..

ఎవరూ అభివృద్ధి చేయలేదని.. ఏకంగా బిచ్చగాడిని ఎన్నికల బరిలో..
గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు అంకప్ప నాయకకు అక్కడి యువత అతనికి తెల్లటి చొక్కా, కూలింగ్ గ్లాసెస్ తెప్పించి మరీ దర్జాగా కారులో తీసుకువెళ్లారు.

మాకు ఓటేసి గెలిపిస్తే మీకోసం మేము ఎన్నో చేస్తాం అంటారు.. ఎలక్షన్ల రోజు వరకు నియోజక వర్గంలో ఆయన భజనే చేసేలా అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటారు.. గెలిచిన తరువాత అడ్రస్ ఉండరు.. పదవిలోకి వచ్చాక పైసలు పోగు చేసుకునే పనిలో పడతారు తప్ప ప్రజల సమస్యలు పట్టవు.. నియోజకవర్గ అభివృద్ధి ఊసే ఉండదు.. దీంతో విసిగి వేసారి పోయారు.. నాయకులకు బుద్ది చెప్పాలని ఓ నిర్ణయానికి వచ్చింది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని బొక్కాహల్లి గ్రామానికి చెందిన యువత.

ఇక్కడ ఎవరు గెలిచినా అభివృద్ధి సున్నా. అయితే దీనిని గుర్తించిన గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించి 43 ఏళ్ల అంకప్ప నాయక అనే ఓ యాచకుడిని బరిలోకి దించారు. కన్నడ సినిమా "సింహాద్రియ సింహా" స్పూర్తితోనే అంకప్ప నాయకను రంగంలోకి దించారు. ఎవరూ లేని అంకప్ప నాయక బస్టాండ్ లో తలదాచుకుంటూ కడుపు నింపుకునేవాడు. అయితే అతనిని గ్రామస్తులు బరిలోకి దించడంతో ఇప్పడుతడు స్టార్ అయిపోయాడు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెళుతున్న అంకప్ప నాయకకు అక్కడి యువత అతనికి తెల్లటి చొక్కా, కూలింగ్ గ్లాసెస్ తెప్పించి మరీ దర్జాగా కారులో తీసుకువెళ్లారు. యువతతో పాటు అంకప్ప ఎన్నికల ప్రచారం చాలా చురుగ్గా సాగుతోంది. బిక్షాటనకు బదులుగా అంకప్ప ఇప్పుడు ఓట్లు అడుగుతున్నాడు. ఈ నెల 27 న అక్కడ రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

అయితే దీనిపైన స్థానికులలో ఒకరైన బొక్కల్లి లింగయ్య మాట్లాడుతూ.. ఇక్కడి గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు గెలిచిన వారు ఎవ్వరు కూడా వాటికి పరిష్కారం చూపించడంలో విఫలం అయ్యారు. దీంతో గ్రామంలోని యువత డబ్బు ఉన్న వ్యక్తిని కాకుండా పేదవాడిని బరిలోకి దించాలని కోరారు. అందుకే అంకప్ప నాయక బరిలోకి దించామని, అతనితో అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు ఆశిస్తున్నట్టు వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story