Praggnanandhaa : ఎవరీ ప్రజ్ఞానంద... ప్రపంచ నెంబర్ వన్ నే మట్టికరిపించాడు..!

Praggnanandhaa : ఎవరీ ప్రజ్ఞానంద... ప్రపంచ నెంబర్ వన్ నే మట్టికరిపించాడు..!
X
Praggnanandhaa : ఇండియన్ గ్రాండ్ మాస్టర్.. 16 ఏళ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌‌సెన్‌ను మట్టికరిపించాడు.

Praggnanandhaa : ఇండియన్ గ్రాండ్ మాస్టర్.. 16 ఏళ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌‌సెన్‌ను మట్టికరిపించాడు. ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో కార్ల్‌సెన్‌ను ఓడించడంతో భారీ విజయాన్ని సాధించాడు. టర్రాష్ వేరియేషన్ గేమ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే మాగ్నస్‌ను ఇంటికి పంపాడు. ప్రస్తుతం భారత యువ మాస్టర్‌ ప్రజ్ఞానంద 8 పాయింట్లతో 8 రౌండ్ల తర్వాత 12వ స్థానంలో నిలిచాడు. టోర్నీలో రెండు డ్రాలు, నాలుగు ఓటములను కూడా చవిచూశాడు.

తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, ఓవరాల్‌గా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో చెస్ ప్లేయర్. 2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రజ్ఞానంద, ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు...10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచిన ప్రజ్ఞానంద, తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న వ్యక్తులను కూడా ఆశ్చర్యపరుస్తూ.. విశ్వ వేదికపై దూసుకుపోతున్నాడు.

Tags

Next Story