కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో కలకలం

కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో కలకలం
X
మంత్రి రాసలీలల వీడియో వైరల్ కావడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓ మంత్రి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఓ యువతితో మంత్రిగారి కామక్రీడల వీడియో వైరల్ కావడంతో మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. విపక్షాలు కూడా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రే ఇలా నీచంగా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

షార్ట్ ఫిల్మ్ విషయమై సహకారం అడిగేందుకు జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి దగ్గరకు కొన్ని రోజుల క్రితం ఓ యువతి వచ్చింది. అయితే ఆ యువతిని మంత్రి ప్రలోభపెట్టారని.. కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాసలీలల వీడియో వైరల్ కావడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.

అయితే ఇది పక్కా హనీ ట్రాప్ అని అధికార నేతలు భావిస్తున్నారు. ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు ఈ వీడియోను రిలీజ్ చేయగా.. దినేష్ మలహల్లి అనే ఆర్టీఐ కార్యకర్త.. కబ్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. బహుశా పరస్పర ఆమోదంతో జరుగుతున్న శృంగారంగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

గతంలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంలో రమేష్ జాలిహోర్కి ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపునకు తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బీఎస్ యడియూరప్ప సీఎం కావడంతో ఆయనకు ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల శాఖను కేటాయించారు. ఏకంగా కేబినెట్ మంత్రే సెక్స్ స్కాంలో ఇరుక్కోవడం యడియూరప్ప ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.



Tags

Next Story