లాక్‌డౌన్‌లో ఫట్‌మన్న జాబ్..టీ అమ్ముతూ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే!

లాక్‌డౌన్‌లో ఫట్‌మన్న జాబ్..టీ అమ్ముతూ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టించింది. కరోనా కొట్టిన దెబ్బకి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. లాక్ డౌన్.. కరోనా సృష్టించిన విలయంతో కొందరి ఉద్యోగాలు ఫట్ మన్నాయి. ఈ మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో 40 ఏళ్ల మహేంద్ర వర్మ కూడా ఉన్నారు. అయితే ఉద్యోగం కోల్పోయినా జీవితంలో తనకంతా మంచే జరిగిందంటున్నారు మహేంద్ర. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినా టీ అమ్ముతూ నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నానంటూ గర్వంగా చెబుతున్నారు మహేంద్ర. 10 గంటల పాటు జాబ్ చేస్తే.. నెలకు రూ. 12 వేలు మాత్రమే వచ్చేవి.. అదే సైకిల్‌పై టీ అమ్మితే నెలకు రూ. 40 వేలు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహేంద్ర.

జాబ్ కోల్పోటంతో రెండుమూడు నెలలు ఖాళీగా ఇంట్లోనే కూర్చోవలసి వచ్చిందని.. డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడినట్లు మహేందర తెలిపారు. దీంతో టీ అమ్మటం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని టికరీ బార్డర్ ప్రాంతంలో టీ రూ. 5కు, కాఫీ రూ.10కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. చలికాలంలో టీ, కాఫీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని.. పాత సైకిల్ వెనుక ట్రే అమర్చి.. వాటిలో టీ ప్లాస్కులు ఉంచి.. విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం కన్నా ఈ వ్యాపారమే లాభదాయకంగా ఉందని.. దీనినే కొనసాగిస్తానని మహేంద్ర అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story