President Murmu: కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుని.. ముర్ము ఎమోషన్‌

President Murmu: కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుని.. ముర్ము ఎమోషన్‌
President Murmu: అదే కాలేజీలో చదువుకుని ఇప్పుడు రాష్ట్రపతిగా స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వెళ్లడం నిజంగా హర్షణీయం. చదువు విలువ, కష్టం విలువ తెలిసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

President Murmu: అదే కాలేజీలో చదువుకుని ఇప్పుడు రాష్ట్రపతిగా స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వెళ్లడం నిజంగా హర్షణీయం. చదువు విలువ, కష్టం విలువ తెలిసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

మయూర్‌భంజ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ ముర్ము, అప్పటి కళాశాల అయిన రమా దేవి విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేసింది. శుక్రవారం భువనేశ్వర్‌లోని రమా దేవి మహిళా విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఉద్వేగానికి లోనయ్యారు.

ప్రెసిడెంట్ ముర్ము తన ప్రసంగంలో కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.. చదువుకోవడానికే పైసలు ఉండేవి కాదు.. ఇంక చిరుతిండ్లు కొనుక్కోవడానికి డబ్బులెక్కడివి.. అందుకే కాలేజీ క్యాంటిన్ వైపు కన్నెత్తి కూడా చూసే వాళ్లం కాదు.. "ఒక వీధి వ్యాపారి నిమ్మకాయలు, మిరపకాయలతో 25 పైసలకు మసాలా వేరుశెనగలను అమ్మేవాడు. అవే కొనుక్కుని ఎంతో ఇష్టంగా తినేవాళ్లం. కళాశాల రోజులలో జ్ఞాపకాలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.

"ఈ సంస్థ నా జీవితానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది. ప్రతి విషయంలోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ఇప్పటికీ గుర్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలని నేను విద్యార్థులను కోరుతున్నాను. వివిధ రంగాల్లో రాణించి సమాజానికి ఎనలేని సేవలందించిన మహిళలు చాలా మంది ఉన్నారు' అలాంటి వారిని రోల్ మోడల్స్‌గా తీసుకుని ముందుకు సాగాలి అని ముర్ము అన్నారు.

సామాజిక అసమతుల్యత, లింగ వివక్ష గురించి ముర్ము మాట్లాడుతూ, "మా గ్రామంలోని ప్రజలు నా చదువుల ఉపయోగం గురించి నన్ను అడిగేవారు. ఆడపిల్ల ఎంత చదువుకున్న చివరికి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లవలసిందే. ఇక అప్పుడు చదువుకుని ఉపయోగం ఏం ఉందని అనేవారు. అయితే అమ్మాయిలు శారీరకంగా అబ్బాయిల కంటే భిన్నంగా ఉంటారు.

మానసికంగా దృఢంగా ఉంటారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా మీరు అనుకున్నది సాధించాలి. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీకి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు అని ముర్ము విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.

ముర్ము 2 రోజుల ఒడిశా పర్యటనలో ఉన్నారు. శనివారం లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి, ఆపై కటక్‌లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రెండవ ఇండియన్ రైస్ కాంగ్రెస్‌ను ప్రారంభించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story