Pulwama Attack : పుల్వామా అమర జవాన్లను స్మరించిన ప్రధాని మోదీ

Pulwama Attack : పుల్వామా అమర జవాన్లను స్మరించిన ప్రధాని మోదీ
మసూద్ అజార్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈ దాడికి పాల్పడింది.

పుల్వామాలో అమరులైన భారత జవాన్లను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. "పుల్వామాలో అమరులైన మన పరాక్రమవంతులైన వారిని స్మరిస్తున్నాను"అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది భారత జవాన్లు అమరులై సంగతి తెలిసిందే. మసూద్ అజార్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈ దాడికి పాల్పడింది.

14ఫిబ్రవరి 2019 పుల్వామా దాడి...
14ఫిబ్రవరి 2019 న, జమ్మూ నుండి శ్రీనగర్ కు 2,500మందికి పైగా సెంగ్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిని 78 వాహన కాన్వాయ్ లో రవాణా చేస్తున్నారు. కాన్వాయ్ ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని సూసైడ్ బాంబర్ ద్వారా కారుతో దాడి చేశారు. ఈ ఘటనలో 40మంది జవాన్లు వీరమరణం పొందారు.


దాడిపై విచారణ..
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి చెందిన 12మంది సభ్యుల బృందం విచారణను చేపట్టింది. కారులో 300కిలో గ్రాముల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలు ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఇందులో 80 కిలోగ్రాముల RDX, అధిక పేలుడు పదార్ధం, అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు కనుగొన్నారు.

కారుతో ఢీకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది యొక్క DNA నమూనాలను టెస్ట్ చేశారు. ఈ డీఎన్ఏ నమూనాలు ఆదిల్ అహ్మద్ దార్ తండ్రితో సరిపోలాయి. దాడి చేసిన వ్యక్తి ఆదిల్ అహ్మద్ అని నిర్ధారణ అయింది.

బాలాకోట్ వైమానిక దాడి...
ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ జెట్ లు నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్ లోని బాలాకోట్ లోని తీవ్రవాద స్ధావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో జైషే మహ్మద్ శిక్షణా శిభిరంలోని 300 నుంచి 350వరకు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ ప్రకటించింది.



Tags

Read MoreRead Less
Next Story