TikTok : భారత్ లో 'టిక్ టాక్' పూర్తిగా ఖాళీ

TikTok : భారత్ లో టిక్ టాక్ పూర్తిగా ఖాళీ
వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వచేస్తున్నందకు నిషేదానికి గురైన టిక్ టాక్

చైనాకు చెందిన 'టిక్ టాక్' యాప్ భారత్ లో మూట ముల్లే సర్దుకుంది. నిషేదానికి గురైన మూడు సంవత్సరాల తర్వాత భారత్ లో 'టిక్ టాక్' కార్యాలయాన్ని పూర్తిగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. 'టిక్ టాక్' కు చెందిన 40మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. వారికి 9నెలల విభజన వేతనం ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు.

జాతీయ భద్రతా కారణాలవలన కేంద్ర ప్రభుత్వం 'టిక్ టాక్' పై 2020లో నిషేధం విధించింది. న్యాయపరంగా కేంద్ర ప్రభుత్వంతో విభేదించడానికి ప్రయత్నించి 'టిక్ టాక్' విఫలం అయింది. రెండేళ్ల తర్వాత భారత కార్యాలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. "మా గ్లోబల్, రిజినల్ సేల్స్ టీమ్ లను అభినందిస్తున్నాను. అనుకోని కారణాలతో ఉద్యోగులను కోల్పోవడం బాధగా ఉంది" అని తెలిపారు. 'టిక్ టాక్ ఇండియా' కు పని చేసిన వారిలో ఎక్కువగా దుబాయ్, బ్రెజిల్ నుంచి ఉన్నట్లు తెలిపారు. భారత్ లో 40మంది ఉద్యోగులు ఉండగా వీరికి ఫిబ్రవరి 28వ తేదీ చివరి పనిదినంగా తెలిపారు. వీరికి 9నెలల జీతాన్ని అందిస్తున్నట్లు కంపెనీ అధికారులు చెప్పారు.


చైనా వెలుపల 'టిక్ టాక్' కు, భారత్ లో అతిపెద్ద మార్కెట్ ఉంది. భారత్ లో అత్యధికంగా డౌన్ లోడ్ చేయబడిన యాప్ లలో 'టిక్ టాక్' ఒకటి. భారత వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వచేస్తున్నందున నిషేధించబడింది. నిల్వ చేయబడిన డేటాను చైనా లోని ప్రభుత్వ ఔట్ లెట్ లలో షేర్ చేయబడుతుండటం వలన భారత ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో భారత ప్రభుత్వం టిక్ టాక్ ను బ్యాన్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story