ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
వ్యాక్సిన్ భద్రత, సమర్థత, రోగ నిరోధక శక్తి పెంపుదలపై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

త్వరలో రానున్న కరోనా వ్యాక్సిన్‌ని దేశ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. వ్యాక్సిన్ భద్రత, సమర్థత, రోగ నిరోధక శక్తి పెంపుదలపై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో వ్యాక్సిన్ డ్రై రన్ జరుగుతున్న తీరును మంత్రి స్వయంగా పర్యవేక్షించారు.

వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ జరుగుతోంది. కొన్ని రకాల వ్యాక్సిన్లను అతిశీతల వాతావరణంలో భద్రపరచడమే పెద్ద సవాల్. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ, పంపిణీలో తలెత్తే సమస్యలు, వ్యాక్సినేషన్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై అధికారులు దృష్టి సారించారు.

Tags

Read MoreRead Less
Next Story