వాహనదారులకు గుడ్‌న్యూస్.. 71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ..

వాహనదారులకు గుడ్‌న్యూస్.. 71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ..

బండిలో పెట్రోల్ కొట్టించాలంటే గుండె దడ పెరుగుతుంది. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే పట్టుమని రెండ్రోజులైనా రాదు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఒకపక్క.. పెట్రోల్ లేకపోతే బండి నడవదు మరో పక్క. వెరసి మధ్యతరగతి వాహనదారుడు సతమతమవుతూ బతుకు బండిని నడుపుతుంటాడు. ఈ నేపథ్యంలో 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా దొరుకుతుందంటే ఎందుకు ఊరుకుంటారు.. ఎగిరి గంతేయరూ.. ఎక్కడా అని ఆరా తీయరూ.. గత కొంత కాలంగా సిటీ బ్యాంక్.. ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం కుదుర్చుకొని క్రెడిట్ కార్డులు ఇస్తోంది. ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్ పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. కార్డు రివార్డ్ పాయింట్స్‌తో ఏడాదికి 71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.

ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినమ్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్‌పై ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఫ్యూయెల్‌పై సర్‌ఛార్జ్ 1 శాతం తగ్గింపు ఉంటుంది. దాంతో పాటు ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో రూ.150 ఖర్చు చేస్తే 4 టర్బో పాయింట్స్ వస్తాయి. ఒక టర్బో పాయింట్ విలువ రూ.1. ఇలా ఫ్యూయెల్‌పై ఏడాదిలో గరిష్టంగా 5000 వరకు టర్బో పాయింట్స్ పొందొచ్చు. అంటే రూ. 5000 విలువైన రివార్డ్స్ లభిస్తాయి. ఆ టర్బో రివార్డ్ పాయింట్స్‌ని మళ్లీ ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో రీడీమ్ చేయొచ్చు. దీని ద్వారా సుమారు ‌71 లీటర్ల పెట్రోల్ ఉచితంగా లభిస్తుందని సిటీ బ్యాంక్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story