'గేట్' ర్యాంకు సాధించి.. నాన్నకు సాయంగా పకోడీల వ్యాపారం..

గేట్ ర్యాంకు సాధించి.. నాన్నకు సాయంగా పకోడీల వ్యాపారం..

కార్పొరేట్ స్కూల్లో చదువుకుని, మంచి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులను చూస్తే.. మనం కూడా అలాంటి స్కూల్లో చదువుకుంటే మంచి ర్యాంకులు వచ్చేవి అనుకుంటారు చాలా మంది విద్యార్థులు. కానీ చదువుకోవలన్న పట్టుదల ఉండాలే కాని ఎక్కడ ఉన్నా చదువుకోవచ్చు. అవకాశాలు ఏమీ లేకపోయినా, అమ్మానాన్న కష్టాన్ని కళ్లార చూసి, కష్టపడి చదువుకుని ర్యాంకు తెచ్చుకుంటే అదే నిజమైన ప్రతిభ. ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న సాగర్ షా తండ్రి పకోడీల వ్యాపారం చేస్తాడు. నాన్నకి చేదోడు వాదోడుగా వుంటూ చదువుకుంటున్నారు ఆయన ఇద్దరు పిల్లలు. పన్నెండో తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసాడు సాగర్. M-Tech చేస్తాను నాన్నా.

అందుకోసం GATE పరీక్ష రాస్తాను అన్నాడు సాగర్ తండ్రితో. అవేవీ నాకు తెలియవు కానీ. నువు చదువుకో అన్నాడే కానీ తను మరో రెండేళ్లు కష్టపడాలి అనుకున్నాడు తండ్రి మనసులో. గేట్ పరీక్ష రాసిన సాగర్‌కి 8వేల ర్యాంకు వచ్చింది. ఇంటికి దూరంగా వెళ్లి రెండేళ్లు చదువుకోవాలి. డబ్బుల కోసం అమ్మానాన్న మీద ఆధారపడాలి. అందుకే వద్దనుకున్నాడు. ఇక్కడే నాన్నతోనే ఉండి వ్యాపారం చూసుకుంటాను అని పై చదువులు చదవడానికి వెళ్లలేకపోయాడు సాగర్. అయినా కొంచెం కూడా బాధపడకుండా.. గేట్ పాసవ్వాలన్నది నాకల. అందుకు చాలా కష్టపడ్డాను. ఆ ర్యాంకుతో NITలో సీటు వస్తుంది కానీ నన్ను చదివించడం కోసం నాన్న ఇంకా కష్టపడాలి. అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. అందుకే అమ్మానాన్నతోనే ఉండి ఆర్థికంగా వారికి అండగా నిలబడాలనుకుంటున్నానని తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story