డిగ్రీ అర్హతతో ఇఫ్కోలో ఉద్యోగాలు.. శిక్షణా కాలంలో రూ.37,000 స్టైఫెండ్

డిగ్రీ అర్హతతో ఇఫ్కోలో ఉద్యోగాలు.. శిక్షణా కాలంలో రూ.37,000 స్టైఫెండ్

ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ -IFFCO అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులు కేవలం అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీలకు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 5. కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.33,000 స్టైఫెండ్ లభిస్తుంది. ఆ తర్వాత రూ.37,000 బేసిక్ వేతనం, అలవెన్సులు అదనంగా ఉంటాయి. అగ్రికల్చర్‌లో 4 ఏళ్ల ఫుల్‌టైమ్, రెగ్యులర్ బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు అర్హులు. చివరి సెమిస్టర్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ విద్యార్థులు 60%, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 55% మార్కులతో పాస్ కావాలి. ఎంఎస్సీ అగ్రికల్చర్ రెండేళ్ల ఫుల్‌టైమ్ కోర్సు పూర్తిచేసినవాళ్లు కూడా అర్హులే. సెప్టెంబర్ 1 నాటికి 30 ఏళ్లు నిండినవారు అప్లై చేసుకోవచ్చు. క్రిమీలేయర్‌లో లేని ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story