Layoffs : 600 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ

Layoffs : 600 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల్లో లే ఆఫ్స్ నడుస్తున్నాయి. 2024లో ఇప్పటివరకు అనేక ప్రఖ్యాత కంపెనీలు తమ ఉద్యోగులకు ఎగ్జిట్ డోర్ చూపించాయి. ఇప్పుడు వాటికి టెక్ దిగ్గజం, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యాపిల్ పేరు కూడా చేరిపోయింది.

ఆపిల్ ఇటీవల 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ కూడా తాజా తొలగింపులను ధృవీకరించింది. కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కి తన ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది. కాలిఫోర్నియాలో యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.

కార్‌, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్ట్‌ను మూసివేయడం వల్ల కంపెనీ ఈ తొలగింపుల నిర్ణయం తీసుకుంది. యాపిల్.. ప్రపంచ నంబర్ 2 కంపెనీ. ఆపిల్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉంది. తొలగించబడిన వారిలో కనీసం 87 మంది ఆపిల్ సీక్రెట్ అగ్రిమెంట్ లో పనిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story