లంక గ్రామాల్లో తగ్గుముఖం పట్టిన వరద

లంక గ్రామాల్లో తగ్గుముఖం పట్టిన వరద

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టింది. గత మూడ్రోజులుగా లంక గ్రామాల్లో పర్యటిస్తోంది టీవీ5 టీం. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్‌ ఇస్తోంది. ప్రస్తుతం గ్రామాల్లో వరద పరిస్థితి తగ్గినా.... ప్రజలు మాత్రం దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. తాగేందుకు నీరు లేక, తినేందుకు తిండిలేక అలమటిస్తున్నారు ఇక్కడి ప్రజలు. సహాయం కోసం ఎదురు చూస్తోన్న లంకవాసులకు.. టీవీ5 ఆపన్న హస్తం అందించింది. వరదబాధితులకు...నీళ్ల బాటిళ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లను పంపణీ చేసింది.

పెద్ద లంకకు చెందిన ట్రాక్టర్‌ యజమాని రాము సాహాయంతో... లంక గ్రామంలో పర్యటించింది టీవీ5 టీం. 22 గ్రామాలకు గాను 15 గ్రామాల్లో వరద తగ్గింది. ఇప్పుడిప్పుడు జనం బయటికి వస్తున్నారు మరో 7 గ్రామాల్లో వరదనీరు ఇప్పటికీ తగ్గలేదు. దీంతో ఇంటిపైకప్పులపైనా వీళ్లు జాగారం చేస్తున్నారు. టీవీ5 విజ్ఞప్తి మేరకు.. రెడ్‌ క్రాస్‌ సైతం రంగంలో దిగింది. లంక గ్రామాలకు... 500 వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేసింది రెడ్‌ క్రాస్‌ సొసైటీ. టీవీ5 చేసిన సాయానికి.. ఇక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు అధికారులు ఇక్కడికి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

Tags

Read MoreRead Less
Next Story