అతడి రక్తం 24 లక్షల మంది పిల్లల్ని..

అతడి రక్తం 24 లక్షల మంది పిల్లల్ని..

దేవుడు భూమ్మీదకి జేమ్స్ హారిసన్‌ని ఓ పుణ్యకార్యం చేయమని పంపించాడేమో. ప్రాణమైతే పోశాను కానీ వారికి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే అన్నాడేమో. అందుకే అతడి రక్తం యాంటీ బయాటిక్‌గా పనిచేస్తోంది. లక్షల మంది చిన్నారులకు జేమ్స్ రక్త దానం చేస్తున్నారు. 60 ఏళ్ల నుంచి ప్రతి వారం రక్త దానం చేస్తూ 'మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్‌'గా పేరు పొందిన జేమ్స్ ఆస్ట్రేలియన్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటివరకు 2.4 మిలియన్ల (24 లక్షలు) మంది పిల్లలకు రక్తదానం చేశారు. ఇతని రక్తంలో ప్రత్యేకమైన వ్యాధి నిరోధక ప్రతిరోధకాలు ఉన్నాయని CNN నివేదించింది. ఇది యాంటీ-D అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేయడానికి దోహదపడింది. రీసస్ అనే ప్రాణాంతకమైన వ్యాధికి వ్యతిరేకంగా పోరాడడానికి సాయపడుతుంది. UK నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. గర్భిణీ స్త్రీ రక్తంలోని ప్రతిరోధకాల కారణంగా ఆమె శిశువు రక్త కణాలను రీసస్ వ్యాధి నాశనం చేస్తుంది.

ఈ వ్యాధి సోకితే మెదడు దెబ్బతినడం లేదా శిశువులకు మరణం కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధిని నివారించే ఇంజెక్షన్‌ తయారు చేయడానికి డాక్టర్లు హారిసన్ ప్లాస్మాను తీసుకుని పరీక్షిస్తున్నారు. అనంతరం సేకరించిన ఎర్రక్తకణాలను తిరిగి అతడి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా చేయడం ద్వారా అతడు తరచూ రక్తదానం చేసే స్థితికి చేరుకోగలుగుతున్నాడు. అతడి నుంచి సేకరిచే ప్రతి రక్తపు బొట్టూ ఎంతో విలువైనది అని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సర్వీసు జెమ్మ ఫల్కెన్ మిరే అంటారు. పుట్టబోయే శిశువులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందని గుర్తిస్తే గర్భంతో ఉన్నప్పుడే మాతృమూర్తికి జేమ్స్ రక్తం ఎక్కిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story